సంతనూతలపాడు: అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను తనిఖీ చేసిన కలెక్టర్

82பார்த்தது
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామంలోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో జరిగే వ్యవసాయ పరీక్షల గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు అగ్రీ టెస్టింగ్ ల్యాబ్ ఉపయోగాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி