ట్రూ అప్ చార్జీల పేరుతో ఈనెల, వచ్చే నెలలో ప్రజలపై విద్యుత్ భారం పడనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని సిపిఎం 13వ మహాసభ సందర్భంగా సుందరయ్య భవన్ లో గురువారం రాత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపితే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.