ప్రకాశం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా ఏ. కిరణ్ కుమార్ శనివారం ఒంగోలులోని డిఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం డిఈఓ గా విధులు నిర్వహిస్తున్న సుభద్ర బదిలీపై వెళ్లారు. నూతన డీఈఓ కిరణ్ కుమార్ ను అధికారులు అభినందించారు. జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.