డ్రైనేజీ కాలువలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

53பார்த்தது
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. కనిగిరిలోని ఓవి రోడ్డులో ఆక్రమణలకు గురైన డ్రైనేజీ కాలువలను శనివారం మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల ఆక్రమణల వల్ల డ్రైనేజీ నీరు ప్రవహించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలు ఆక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

தொடர்புடைய செய்தி