కనిగిరి మున్సిపాలిటీకి 30 పుష్ కాట్స్ మంజూరు అయినట్లుగా కనిగిరి మున్సిపల్ కమిషనర్ దానియేలు జోసెఫ్ శనివారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పారిశుధ్య పనుల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కమిషనర్ తెలిపారు. నూతనంగా 30 పుష్ కాట్స్, 13 బిగ్ దస్ట్ బిన్స్ ను వార్డులలో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా తెలిపారు. పుష్ కాట్స్ ద్వారా పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరిస్తామన్నారు.