కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కనిగిరి మున్సిపాలిటీలోని 8వ వార్డులో దర్గాను సందర్శించి దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మత పెద్దలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.