పారిశుధ్యపరంగా ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం చెత్తకుండీలు, నెట్టుడు బండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచించారు.