కనిగిరి పట్టణంలోని రహదారుల విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో బుధవారం కూల్చివేశారు. కనిగిరిలోని చెప్పుల బజార్, ఓవి రోడ్డు, పామూరు రోడ్డులో రహదారులను ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను జెసిబి యంత్రాలతో అధికారులు తొలగించారు. అక్రమ కట్టడాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఉండటంతో రహదారుల విస్తరణకు అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.