కనిగిరి పట్టణంలోని 9వ వార్డు బోయపాలెంలో డ్రైనేజీ కాలువల్లో చేపట్టిన పూడిక తీత పనులను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులకు ప్రభుత్వం రూ. 33 లక్షలు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో పూడికతీత పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు.