ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన కనిగిరి మున్సిపల్ చైర్మన్

79பார்த்தது
ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన కనిగిరి మున్సిపల్ చైర్మన్
కనిగిరి పట్టణంలోని నాలుగవ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకుని, కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్, వన్ స్టూడెంట్ నినాదంతో ప్రవేశపెట్టిన అపార్ కార్డు ఐడిని పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி