కనిగిరిలో కోట్ల బజారు నుండి నాజ్ సెంటర్ వరకు రహదారులపై, సైడ్ కాలువల మీద నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించుకునేలా నిర్మాణదారులకు సమాచారం అందించాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ సువర్ణ కుమార్ బుధవారం సిబ్బందికి సూచించారు. ఈనెల 28వ తేదీ లోపు అక్రమ నిర్మాణాలను తొలగించాలని, అలా తొలగించని పక్షంలో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో తొలగించడం జరుగుతుందని ప్రజలకు తెలియచేయాలని సిబ్బందికి సూచించారు.