దర్శిలోని 17వ వార్డులో మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో మాట్లాడి కులాయిల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కమిషనర్ మహేశ్వర రావు, కౌన్సిలర్లు దినకర్, వల్లి బాబు పాల్గొన్నారు.