ఆరోగ్య సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు చేసుకున్న బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను దర్శి టిడిపి ఇంఛార్జీ గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. దర్శిలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణకు రూ.2,17,200 చెక్కు మంజూరు కాగా ఆ చెక్కును గొట్టిపాటి లక్ష్మి అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.