కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఎస్ కోట మండలంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్జీపేట, వినాయకపల్లి, ఎస్ కోట తదితర ప్రాంతాల్లో మహిళలు వేకువ జామున లేచి ఆయా గ్రామీణ ప్రాంతాల్లో గల చెరువులు, నదుల్లో స్నానాలు ఆచరించి అరటి జోర్లలో కార్తీక దీపాలను నీటిలో వదిలి ఆలయ ప్రాంగణాల్లో గల రావి, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేపట్టి శివయ్యను ఆరాధించారు.