జామి ఎంపీడీవో కార్యాలయంలో ఎస్ అరుణ అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు ఆదివారం పాల్గొన్నారు. సమావేశంలో మండల శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరారు. మండలంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ, మరమ్మతు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సత్వరమే పూర్తి చేయాలని కోరారు. జడ్పిటిసి గొర్లె సరయు తదితరులు పాల్గొన్నారు.