మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సాలూరు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ వై. నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం మంత్రి సంధ్యారాణికి మున్సిపల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అప్కొస్ ద్వారా రిటైర్మెంట్ అయిన వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలనీ, పర్మినెంట్ ఉద్యోగులకు సరెండర్ లివులు, డిఎ బకాయిలు చెల్లించాలన్నారు.