సాలూరు నియోజకవర్గ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాలకు రహదారుల నిర్మాణం నిమిత్తం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భూమి పూజ చేసారు. సోమవారం సాలూరు మండలం చంద్రప్పవలస నుచి ముగడవలసకు రూ. 1.60కోట్లు, చిన్నివలస నుంచి పునికిలివలస రోడ్డు రూ. 50లక్షలు, గుండ్రపువలస నుంచి కరాసువలస రూ. 1.55 కోట్లు నిధులతో రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసి, శిలాఫలకాలు ఆవిష్కరించారు. అలాగే దాగరవలస రోడ్డును ప్రారంభించారు.