విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి గిరిజనులను ఇబ్బంది పెడతారా అని విద్యుత్ సిబ్బందిపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా కూర్మరాజుపేట పంచాయతీ చిన్నవలస, పునికిల వలసకు వచ్చిన మంత్రికి గ్రామ గిరిజనులు ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లకు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయని. బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేశారని మంత్రికి తెలిపారు.