పాచిపెంట మండలం ఏజెన్సీ గ్రామాల రహదారులు మరమ్మతులుకు చేరుకున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం గిరిజన సంఘం నాయకులు కోరాడ ఈశ్వరరావు, గెమ్మెల చిన్నారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఏజెన్సీ ప్రాంతం రహదారులు పరిశీలించారు. బడ్నాయిక వలస, కీము, సెంటర్ నుండి కుంతాం గ్రామం వెళ్లే వరకు రహదారులు పూర్తిగా నాశనం అయిపోయాయని, ప్రయాణికులు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.