సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పాంచాలి, గురివినాయుడు పేట గ్రామాలలో పల్లెపండగ కార్యక్రమానికి మంత్రి సంధ్య రాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పాంచాలి, గురివినాయుడు పేటలో మంత్రి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాంచాలి నుంచి కూనంబందవలస, పాంచాలి నుంచి కొత్తవలస గ్రామాలకు రూ. 4కోట్లతో రెండు బీటి రోడ్లు, గురివినాయుడు పేట నుంచి పూడి గ్రామానికి రూ. 60 లక్షలతో రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.