రామభద్రపురం మండలం తహశీల్దార్ ఆకుల సులోచన రాణికి, ఎంపీడీవో రత్నంలకు 108 ఉద్యోగులు శుక్రవారం వినతిపత్రం అందించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ స్టేట్ కమిటీ పిలుపుమేరకు 108లను ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగుల వద్ద వసూలు చేసిన పీఎఫ్, ఈఎస్ఐ వాటాను తిరిగి ఏరియర్స్ రూపంలో తిరిగి చెల్లించాలన్నారు. డీఈఓలకు, డ్రైవర్ లకు జీవో నంబర్-7 ప్రకారం వేతనాలు చెల్లించాలని చల్లా బంగారి, గులిపల్లి ప్రభాకర్ రావు కోరారు.