విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఏర్పాటు చేసిన శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలిమ్ కో సంస్ధ సౌజన్యంతో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో గురువారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో ఎంపికైన వారికి పత్రాలను పంపిణీ చేసారు.