18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఇళ్ల వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు గంట్యాడ పి హెచ్ సి వైద్యాధికారులు సతీష్, పల్లవి తెలిపారు. ఈ మేరకు మండలంలోని వసాదిలో గురువారం క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. బిపి, షుగర్, సర్వైవల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలను ఇళ్ళ వద్దే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.