విద్యారంగ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయ సంక్షేమం సమాజ శ్రేయస్సు లక్ష్యంగా ఏపీటీఎఫ్ శ్రేణులు , కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. పద్మావతి పిలుపునిచ్చారు. సోమవారం బొబ్బిలి ఏపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా గౌరవాధ్యక్షులు బంకురు జోగినాయుడు అధ్యక్షతన ఏపిటి ఎఫ్ జోనల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె సి రాజు తదితరులు పాల్గొన్నారు.