75 త్యాళ్ళూరు హైస్కూల్లో "హ్యాండ్ వాష్" పై అవగాహన

61பார்த்தது
75 త్యాళ్ళూరు హైస్కూల్లో "హ్యాండ్ వాష్" పై అవగాహన
పెదకూరపాడు మండలం 75‌ త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో మంగళవారం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించారు. తినడానికి ముందు మరియు తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడానికి సరైన పద్ధతిని, నిత్య జీవితంలో పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ పున్నారావు, పీడి అరుణశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி