కూతురుపై తండ్రి అఘాయిత్యం
కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడని తల్లి గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. తనను కూలీ పనులకు పంపించి తన భర్త, అతని అన్న, తమ్ముడు ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడుతున్నారని గుంటూరుకు చెందిన ఓ మహిళ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని నాయకులు సూచించారు.