మంగళగిరి: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. సోమవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ మద్యం సేవించే వారిపై ఉపోక్షించమని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పోలీస్ సిబ్బంది గస్తీ నిరంతరం ఉంటుందని ఆయన తెలిపారు.