పల్నాడు: డయేరియాతో ఇద్దరు మృతి

68பார்த்தது
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం అంజనాపురం కాలనీలో గురువారం డయేరియాతో ఇద్దరు మృతిచెందారు. వాంతులు, విరేచనాలతో వెంకటేశ్వరరావు (21), చిన్నవీరయ్య (58) మరణించారు. కాలనీలో పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటి వల్లనే డయేరియా మరణాలు సంభవిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, దాచేపల్లి తహశీల్దార్ కుటుంబరావు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంజనాపురంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி