ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జక్కంపూడి కాలనీలో ఆర్మీ సేవలు కొనసాగుతున్నాయి. సోమవారం మద్రాస్ ఆర్మీ సహాయంతో వరదలలో చిక్కుకుపోయిన వాహనాలను బయటకు తీస్తున్నారు. అంతేకాకుండా వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించే వాహనాలు నీటిలో ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా, దగ్గర ఉండి మరి వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రజలకు మేమున్నామంటూ ఆర్మీ భరోసా కల్పిస్తున్నారు.