ఎన్టీఆర్ జిల్లాను పూర్తి వరద ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ శనివారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 30, 31 తేదీల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విజయవాడలోని 32 డివిజన్లు పూర్తిగా మునిగాయి. 2 లక్షల మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. బుడమేరు, కృష్ణా నది, మున్నేరు వరదల కారణంగా చాలా ప్రాంతాలు నష్టపోయాయి. వరద బాధిత జిల్లాగా ప్రకటించడంతో కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.