కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మంగళవారం కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తాయని, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కూటమిలో ఎలాంటి కుమ్ములాటలు లేవని స్పష్టం చేశారు.