ఇటీవల ఎంత మంది పిల్లలున్నా పోటీకి అర్హులని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు గల కారణాలను తాజాగా వివరించింది. జనాభా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గిపోయింది. అలాగే 2001లో 2.6 నుంచి 1.5 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉంది. అందుకే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది.