నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్ లో భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావం తెలియజేస్తూ గురువారం వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కాకాని మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పేరుకే ఉచిత ఇసుక తప్ప రేట్లు గతంలో కన్నా మూడింతలు పెరిగాయన్నారు. ఎన్నికల ముందు ఉచిత ఇసుక అందిస్తామని హామీ ఇచ్చి అసలు ఇసుకే లభ్యం కాకుండా చేయడం అన్యాయం అన్నారు.