బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్కపాళెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జీ. యర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, చెన్నై వ్యవస్థాపకులు శ్రీ పెళ్లూరు రవీంద్ర రెడ్డి సుమారు ₹30, 000 విలువ గల స్పోర్ట్స్ యూనిఫామ్ బుధవారం బహుకరించడం జరిగింది.ముఖ్య అతిధిగా నెల్లూరు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, సమగ్ర శిక్ష శ్రీ సుధీర్ బాబు విచ్చేసి పిల్లలను మీ ఉజ్వల భవిష్యత్ కొరకు మంచిగా చదువుకోవాలని తెలియజేసారు.