నెల్లూరు రూరల్: వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం పౌర్ణమి తిధి సంధర్బంగా ఉత్సవ మూర్తులకు అభిషేకం, చిన్న గరుడ సేవ గిరిప్రదక్షిణ ఉత్సవంను వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యంలు, వేదపండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి, ప్రధాన అర్చకులు భాస్కరా చార్యులు పాల్గొన్నారు.