ఏఎస్పేట: పత్రికల వల్ల సమస్యకు పరిష్కారం దొరికింది

66பார்த்தது
ఏఎస్పేట: పత్రికల వల్ల సమస్యకు పరిష్కారం దొరికింది
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏఎస్ పేట మండల కేంద్రంలోని ప్రధాన మార్గం వర్షం నీటితో అధ్వానంగా మారింది. దీనిపై పలు వార్తాపత్రికల్లో, మీడియా ఛానల్లో జోరుగా ప్రచారాలు జరిగాయి. ఇందుకు అధికారులు స్పందించారు. గురువారం యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టారు. రోడ్డుకు పక్కన వర్షపు నీరు వెళ్లేందుకు సైడ్ కాలువ చేశారు. సమస్య పరిష్కారానికి విలేకరుల కృషి ఎంతో ఉందని స్థానికులు తెలిపారు.

தொடர்புடைய செய்தி