కావలి ట్రంక్ రోడ్డుపై వ్యాపారులు కలిగిస్తున్న ట్రాఫిక్ అంతరాయన్ని నివారించడానికి కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆదివారం చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన, షాపుల ఎదుట వాహనాలను పార్క్ చేసుకునే విధంగా స్థలం కేటాయిస్తూ పోల్స్ ను నాటే కార్యక్రమం చేపట్టారు. స్తంభాల ఏర్పాటు లోపల ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకుండా పోల్ అవతల మాత్రమే వ్యాపారాలు చేసుకునే విధంగా వారికి స్థలం కేటాయిస్తూ సమన్వయంతో పనులను చేపట్టనున్నారు.