ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పెద్దకర్మ నెల్లూరులోని మాగుంట నివాసంలో బుధవారం జరిగింది. మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ నివాళులర్పించారు. కాగా ఆమెకు వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా నివాళులర్పించారు.