వినాయక చవితి ఉత్సవాలపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కీలక వాక్యాలు చేశారు. సోమవారం ఆయన కావలి పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ తన పేరు చెప్పి ఎవరైనా చందాలు వసూలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా, కావలి ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎమ్మెల్యే గ్రాండ్ గా చవితి ఉత్సవాలు చేయమన్నాడని చందాలు అడిగితే తనకు తెలపాలన్నారు.