ఎమ్మిగనూరు: ఆడుకుంటూ పురుగుల మందు తాగిన ఇద్దరు చిన్నారులు
ఎమ్మిగనూరు మండలంలోని కే నాగలాపురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు శనివారం ఆటలాడుకుంటూ హరికృష్ణ (6), మహి (4) ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. బంధువులు హుటాహుటిన ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ మహి మృతి చెందారు. హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.