ఎమ్మిగనూరు: ఎల్లెల్సీ కాల్వలో పడి మహిళ మృతి
ఎమ్మిగనూరు సమీపంలోని ఎల్లెల్సీ కాల్వలో పడి వనపర్తికి చెందిన రేణుక (27) అనే మహిళ మృతి చెందింది. వనపర్తికి చెందిన రేణుక, బాలరాజు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి పోవు దారిలో ఎల్లెల్సీ దగ్గర ఆటో నిలిపి, కాల్వలో చేతుల శుభ్రం చేసుకుంటు న్న క్రమమంలో రేణుక కాళ్లు జారి పడిపోయింది. స్థానికులు ఆమెను బయటకు తీశారు. బాలరాజు ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గం మధ్యలోనే చనిపొయింది.