ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ అన్నారు. మంగళవారం ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను కమిషనర్ గంగిరెడ్డి, జనసేన నాయకులు చల్లా వరుణ్, డాక్టర్ బాలాజీతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. రోగులు, వారి సహాయకులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, తాగునీరు ఏర్పాటు చేస్తామన్నారు.