పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లేడు చౌదరి గూడెం, కొందుర్గ్, కేశంపెట్, ఫరూఖ్ నగర్, షాద్ నగర్ టౌన్ 117 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం నుండి మంజూరైనా చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు.