ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వర రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ఆదివారం అర్జీలు అందాయి. ఎమ్మెల్యే స్వయంగా వినతులను స్వీకరించారు. నాల్గోవ వార్డు కౌన్సిలర్ రామదాసు గౌడ్ రోడ్లు, డ్రెయినేజీ, విధి లైట్లు వంటి సమస్యలపై చర్చించారు. మున్సిపల్ మంచినీటి సరఫరా లోపాలను కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యే, వినతులను సమీక్షించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.