కర్నూలు జిల్లాలో హత్యలు, హత్యాయత్నాలు, వరుస గొలుసు దొంగతనాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం నేరాల నియంత్రణకు కట్టడి కార్డెన్ సెర్చ్ సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కల్లూరులోని శరీన్ నాగర్ కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు, పత్తికొండ పట్టణంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.