పెద్దకడబూరు మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం దట్టంగా పొగమంచు కనువిందు చేసింది. ఇల్లు, చెట్టు, రోడ్లు, ఎదురుగా వచ్చే వ్యక్తులు, వాహనాలు కనిపించలేనంతగా మంచు కురిసింది. కొద్దిసేపటి తరువాత సూర్యుని లేలేత కిరణాలకు మంచు తెరలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఒక వైపు పక్షుల కిలకిలలు, మరోవైపు పొగమంచు సోయగాల మధ్య ప్రజలు ప్రకృతిని ఆస్వాధించారు.