మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడి రాయితో కొట్టి చంపిన సంఘటన ఆదివారం కులుమాలలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం కోడుమూరు మండలం అనుగొండకు చెందిన కృష్ణవేణి (27)ను కులుమాలకు చెందిన పక్కిరప్పకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశారు. పక్కిరప్ప మద్యానికి బానిసై పని మానేసి జులాయిగా తిరిగేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు భార్యతో గొడవపడి రాయితో కొట్టి చంపాడని సీఐ గంగాధర్ తెలిపారు.