మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని గూడూరులోని మున్సిపల్ కార్మికులు సిఐటియూ డివిజన్ కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఛైర్మన్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. సోమవారం గూడూరులో వారు మాట్లాడారు. పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలని, పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలన్నారు.