మద్యం దుకాణాల నిర్వహణ కోసం కర్నూలు తర్వాత రెండవ స్థానంలో నిలిచిందని, 14 షాపులకు 510 దరఖాస్తులు వచ్చాయని కోడుమూరు ఎక్సైజ్ సీఐ మంజుల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడుమూరులో 150, గూడూరులో 153 దరఖాస్తులు, వెల్దుర్తిలో 109 దరఖాస్తులు, సి. బెళగల్ లోని రెండు మద్యం దుకాణాలకు 84, క్రిష్ణగిరిలోని ఒక మద్యం దుకాణానికి 14 దరఖాస్తులు వచ్చినట్లు, లక్కీ డ్రా కోసం వారంతా కర్నూలు జడ్పీ కార్యాలయానికి రావాలన్నారు.