ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు ఆదివారం ఉదయం వరద నీటిప్రవాహం మరింత పెరిగిందని జలాశయం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. 44, 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని, దీంతో 10 గేట్లను ఎత్తి 42, 070 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 0. 917 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీకి 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.